Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
డబ్బు అహంకారంతో కమ్యూనిస్ట్ పార్టీ ఓట్లతో గెలిచి కమ్యూనిస్ట్ పార్టీ మీద అణిచిత వాక్యాలు చేసిన రాజగోపాల్ రెడ్డి బేశరతుగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తూ శనివారం మండలంలోని బంగారిగడ్డ ఎక్స్ రోడ్ దగ్గర ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాజగోపాల్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ క్షమాపణ చెప్పకపోతే గ్రామ గ్రామన అడ్డుకుంటామని, ప్రతి రోజు నిరసన తెలుపుతామని హెచ్చరించారు. కమ్యూనిస్టులతో పెట్టుకున్న వ్యక్తులు ఎవరు కూడా బాగుపడది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదగోని అరుణ్గౌడ్, ఏఐవైఎఫ్ చండూర్ మండల ఆధ్యక్షుడు కొనరెడ్డి సాయి, నాయకులు దిలీప్, రాకేష్, తరుణ్, చరణ్, సునీల్, స్వామి, రోహిత్, రవి, తదితరులు పాల్గొన్నారు.