Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలి
- బీజేపీ కుట్రతోనే మునుగోడు ఉప ఎన్నికలు
- తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
- దేవలమ్మ నాగారం, దామెర, చింతలగూడెం గ్రామంలో పర్యటించిన మంత్రి
నవతెలంగాణ- చౌటుప్పల్‌రూరల్
మునుగోడు ఉప ఎన్నికలు ప్రజల కోసం కాదని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసమే జరుగుతుందని. మోడీ, అమిత్ షా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిపి పన్నిన కుట్రలో భాగమే ఈ ఎన్నికలను తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం, దామెర, చింతలగూడెం గ్రామాల్లో శనివారం పర్యటించారు. ఆయా గ్రామాల్లో పార్టీ నాయకులతో, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుగోడులో జరుగుతున్న ఎన్నికలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతగానితనం, స్వార్థ ప్రయోజనాల కోసం తెచ్చి పెట్టారన్నారు. దేశంలో బిజెపి ప్రభుత్వం విఫలమైంది. దేశ్ కి నేత కేసిఆర్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశిస్తుండడంతో మోడీ, అమిత్‌షాలకు భయం పట్టుకుందన్నారు. రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కుట్రపన్ని 22 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు తీసుకొని రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారన్నారు. రాజగోపాల్ రెడ్డి మూడున్నర ఏండ్లుగా ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామాన్ని సందర్శించలేదని అన్నారు. కాంట్రాక్టుల కోసం ఢిల్లీ చత్తీష్‌గడ్, అమెరికా, లండన్ లు తిరుగుతూ విహారయాత్రలు చేశారు తప్ప నియోజకవర్గ ప్రజలను ఏనాడు పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వం పేదలను దోసి పెద్దలకు పెడుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి వేస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తుందన్నారు. నాడు 2జి స్పెక్ట్రామ్ రూ.1.70 వేలకోట్ల అవినీతి జరిగిందని గగోలు పెట్టిన మోడీ, నేడు 5జీ స్పెక్రాం ను కేవలం రూ.1.40 వేలకోట్లకు కట్టబెట్టి పది లక్షల కోట్లు మింగారన్నారు. ఈ డబ్బుతోనే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కూల దోస్తు ప్రజాస్వామ్యాన్ని ఆపహస్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు బీజేపీ ఆటలను గమనిస్తున్నారని, మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి నరసింహారెడ్డి, పిల్లలమర్రి శ్రీనివాస్,మండల అధ్యక్షులు గిరికటి నిరంజన్, గ్రామ సర్పంచ్ కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, నా రెడ్డి అండాలు, టిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు నా రెడ్డి అభినందన్ రెడ్డి, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సుర్కంటి శ్రీనివాస్ రెడ్డి, మాదిరెడ్డి వెంకట్ రెడ్డి, చిర్రగొని లింగస్వామి, నిమ్మల మమత, కొండ హారిక, కారింగు సతీష్, శేఖర్ రెడ్డి ,మల్లేష్, మల్లయ్య, నరసింహ %Aరష్ట్రశీస% అశోక్ రెడ్డి, నరేష్ రెడ్డి, రాజు రెడ్డి, శివకుమార్, నవీన్, పాకా రఘు, పాక రాము, బద్దం శివారెడ్డి, దోనూరు జంగారెడ్డి, జనగల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.