Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి
- బీజేపీకి ఓటు వేస్తే మోటార్లకు మీటర్లు తప్పవు
- వంటగ్యాస్ తో సహా డీజిల్,పెట్రోల్ ధరలు పెరుగుతాయి
- సంక్షేమం, అభివద్ధి టీిఆర్యస్తోటే సాధ్యం
- మంత్రి జగదీష్ రెడ్డి
- టీిఆర్‌ఎస్‌లోకి వలసల జాతర...
- గులాబీకి జై కొట్టిన కస్తాల, చండూరు, కిష్టాపురం..
నవతెలంగాణ-చండూరు/ మునుగోడు
మునుగోడు ప్రజలు నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే కాంట్రాక్టుల కోసం రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంచనకు పాల్పడ్డారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. దిగజారుడు రాజకీయాలకు ముసుగు తీస్తే కనిపించే ప్రతి రూపమే రాజగోపాల్ రెడ్డిద న్నారు. అటువంటి వ్యక్తికి రేపటి ఉపఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన లీడర్,క్యాడర్ శనివారం సాయంత్రం మంత్రి జగదీశ్‌రెడ్డ్డి సమక్షంలో టి ఆర్ యస్ లో చేరారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి కి ఓటేస్తే మోటర్లకు మీటర్లు రావడమే కాకుండా అత్యంత దారుణంగా మోదీ సర్కార్ రూపొందించిన విద్యుత్ సంస్కరణలు, వ్యవసాయ చట్టాలు వస్తాయని హెచ్చరించారు. అవే చట్టాలు అంటూ అమలులోకి వస్తే వ్యవసాయదారులకు గుదిబండలుగా మరాయన్నారు. అంతటితో ఆగకుండా ఇప్పటికే పెరిగిన డీజిల్,పెట్రోల్, వంటగ్యాస్ ధరలతో కుదేలవుతున్న సామాన్యుడి మీద పెనుభారం మోపేందుకు బీజేపీ సర్కార్ ప్రణాళికలు రూపొందించిందాన్నారు. సంక్షేమం, అభివద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంతో మాత్రమే సాధ్యపడు తుందన్నారు.అవే పధకాలు దేశవ్యాప్తంగా విస్తరింప చెయ్యాలి అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమన్నారు.అది మునుగోడు ప్రజల భాగస్వామ్యం తోటే ప్రారంభం కావాలన్నారు. చండూరు పురపాలక సంఘం పరిధిలోని 10వ వార్డుకు చెందిన సంకోజు సాయన్న,తరుమని సుధాకర్, సంకోజు శ్రవణ్, 4వ వార్డుకు చెందిన ఇరిగి రామన్న ,ఇరిగి వెంకటేష్‌లు బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ ఎస్‌లో చేరుతున్నట్లు చేరారు. అదే విదంగా మర్రిగూడెం మండల బీజేపీ ఉపాధ్యక్షుడు చిట్యాల సుభాష్ రెడ్డి, బీజెవైఎమ్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆమంచ హరీష్, అంతంపేట 1,2,3 వార్డు సభ్యులు వారి వారి అనుచరులు బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. వీరితో పాటె కిష్టాపురం గ్రామ కాంగ్రెస్ నాయకులు మహేశ్వరం నవీన్,మునుకుంట్ల కిరణ్ తదితరులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు.పార్టీలో చేరిన వారికి మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి అహ్హనించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎన్నికల ఇన్‌చార్జ్జి, శాసనమండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు,చండూరు మున్సిపల్ చైర్మెన్ చంద్రకళా వెంకన్న కౌన్సిలర్లు అన్నేపర్తి శేఖర్,కే. రాంరెడ్డి,కోఆప్షన్ సభ్యులు వహిద్,బోడ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.