Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెలవు దినాల్లో అవస్థలే
- స్పెషల్ దర్శన కౌంటర్ వద్ద గందరగోళం
నవతెలంగాణ-యాదాద్రి
యాదగిరగుట్ట క్షేత్ర సందర్శనకు రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన భక్తులతో శనివారం ఆలయం పోటెత్తింది. ఈ రద్దీగా అనుగుణంగా ఆలయ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. దసరా సెలవులు కావడంతో ఉదయం నుండే వివిధ ప్రాంతాల నుండి కొండపై సందర్శకులతో కిక్కిరిసిపోయారు. స్పెషల్ దర్శననం క్యూ లైన్ లో బారులు తీరారు. రూ. 150 టికెట్ కౌంటర్ సరిగా లేక స్పెషల్ దర్శనం క్యూ లైన్ వద్ద కిక్కిరిసి భక్తుల తోపులాటతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడి క్యూలైన్ సరిగా లేకపోవడం టికెట్ కౌంటర్ ఎక్కడుందో తెలియక భక్తులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. వరుస సెలవులు రావటంతో వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చారు. పెరిగిన రద్దీతో సాయంత్రం వరకు ధర్మ దర్శనం 3గంటలు, ప్రత్యేక దర్శనం 2 గంటలు సమయం పట్టింది. క్షేత్రం పరిసరాల్లో ఎటు వైపు చూసినా భక్తులతో కొండంత కిటకిటలాడింది.
కొండ కింద అలాగే
కొండపైనే రద్దీ ఉందనుకుంటే.... కొండ కింద కూడా అలాగే కొనసాగింది. వివిధ ప్రాంతాన్ని నుండి వాహనాలపై వచ్చిన భక్తులతో యాదగిరిగుట్ట మెయిన్ రోడ్డు పూర్తిగా స్తంభించిపోయింది. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది.
సెలవు దినాల్లో అవస్థలే
ఈ రద్దీ నేపథ్యంలో మహిళలు, పిల్లలు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఇబ్బందులు ప్రతి సెలవు దినాల్లో ఇక్కడి అధికారులు చూస్తున్నవే.. భక్తులు ఎదుర్కొంటున్నవే. అయినా కానీ వారికి సరిపడ సౌకర్యాలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఆదాయం రాబట్టడానికి రకరకాల ఉపాయాలు ప్రవేశపెట్టే అధికారులు అదే ఉత్సాహంతో సౌకర్యాలు ఏర్పాటు ఎందుకు చూపడం లేదో అర్థం కాని పరిస్థితి.
రవాణా కష్టం
ముందుగా రవాణా సౌకర్యం సరిగా లేకపోవడంతో భక్తుల్లో కన్ఫ్యూజన్ నెలకొంటుంది. కొండ చుట్టూ ఉన్న సుమారు ఐదు కిలోమీటర్ల రింగ్ రోడ్ లో సూచిక బోర్డులను ఎక్కడ ఏర్పాటు చేయకపోవడంతో ఎటువైపు వెళ్లాలో అర్థం కాని పరిస్థితి ఉంది. స్థానిక బస్టాండ్ నుండి బయలుదేరిన ప్రయాణికులను లక్ష్మీ పుష్కరిణి వద్ద వదిలిపెట్టాల్సి ఉంది.. కానీ ఆర్టీసీ బస్సులు మాత్రం పార్కింగ్ ప్రదేశంలోనే వదిలిపెడుతుండడంతో చాలా అవస్థలు పడుతున్నారు.
పార్కింగ్ అవస్థలు
కొండపైకి వెళ్లడానికి రూ. 500లు టికెట్ తీసుకున్న ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని సందర్శకులు వాపోయారు. ఆలయ అధికారులుపట్టించుకొన్న పాపాన పోలేదు. కొండకింద రూ. 50ల పార్కింగ్ రుసుం చెల్లించిన సరైన సదుపాయం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.