Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
మండలంలోని కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు వీరమల్ల అంజయ్య వృత్తిలో భాగంగా శనివారం కల్లు మేరా పెట్టడానికి తాటి చెట్టు ఎక్కడ ప్రమాదవశాత్తు పైనుండి జారీ పడుట వలన తలకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి గీత కార్మికులు గమనించి హుటాహుటిన రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అంజయ్యను కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భావండ్లపల్లి బాలరాజు స్థానిక నాయకులతో కలిసి పరామర్శించారు. ప్రభుత్వం స్పందించి తీవ్రంగా గాయపడిన గీత కార్మికునికి ఎక్స్గ్రేషియా తక్షణమే అందించి కార్మికుని కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు. ఆయన వెంట నాయకులు ఎర్ర రవీందర్, గోపగోని ధర్మరాజు ఉన్నారు.