Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గండ్ర సత్యనారాయణ రావు
నవతెలంగాణ -సంస్థాన్‌నారాయణపురం
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయా పార్టీలు పెట్టే ప్రలోభాలకు గురి కావదని కాంగ్రెస్ ఎన్నికల ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.పార్టీ కార్యకర్తలు ఇతర పార్టీలోకి వెళ్ళొద్దన్నారు.మునుగోడు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కష్టపడి పనిచేసే గెలిపించాలని కోరారు. బీజేజీ, టీఆర్ఎస్ పార్టీలో వార్డు మెంబర్లను, సర్పంచులను గ్రామస్థాయి మండల స్థాయి నాయకులను అంగట్లో పశువుల్లా కొంటున్నారన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకమన్నారు. కంకణాలగూడెం సిరి గూడెంగ్రామాల నుండి 9 మంది పార్టీలో కండువలు కప్పి ఆహ్వానించారు..ఈ కార్యక్రమంలో గడ్డం మురళీధర్ రెడ్డి రాస మల్ల యాదయ్య, మహమ్మద్ అక్బర్ అలీ జిల్లా ఉపాధ్యక్షులు మందుగులా బాలకృష్ణ ,ఏపూరి సతీష్ ,కరంటోత్ ప్రజ్ఞా నాయక్ ,గ్రామ శాఖ అధ్యక్షులు చిలువేరు కృష్ణ రత్తుపల్లి యాదయ్య గుత్తా రవీందర్ రెడ్డి జక్కడి చంద్రారెడ్డి ,మీనుగు గోపాలు, మైలారం రాములు, గుండుమల్ల మల్లేష్ , చెక్క నాగభూషణం, బొమ్మరబోయిన రవి, ఎర్రోళ్ల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.