Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల అధికారులు ,ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ కేంద్రంలో శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్మన్ వస్పరి శంకరయ్య , టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మల్లేశ్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.