Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్రూరల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నగదు బదిలీ ద్వారా గొర్రెల పంపిణీ చేయడానికి విధివిధానాల రూపొందించి లబ్ధిదారుల ఖాతాలో ప్రీజింగును ఎత్తివేయాలని జీఎంపీిఎస్ జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ, నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .శనివారం చౌటుప్పల్ లో నిర్వహించిన ఆ సంఘం మునుగోడు నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం గొర్రెల పంపిణీలో జరుగుతున్న అక్రమాలను అవినీతిని నివారించడానికి నగదు బదిలీని ప్రకటించడానికి హర్షిస్తున్నామన్నారు. అదే సందర్భంగా కేవలం మునుగోడు నియోజకవర్గంలోని లబ్ధిదారులకు మాత్రమే వారి ఖాతాలో డబ్బులు జమ చేసి వెంటనే ఖాతాలను ఫ్రీజ్ చేయడం వల్ల వారు తమ సొంత డబ్బులను కూడా తీసుకునే అవకాశం లేకుండా చేశారన్నారు. వెంటనే ప్రీజింగ్ను ఎత్తివేసి విధివిధానాలు రూపొందించి ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న లబ్దిదారులందరి ఖాతాలో నగదు బదిలీ చేయాలని కోరారు.ఈ సమావేశంలో జిఎంపిఎస్ రాష్ట్ర నాయకులు బండారు నరసింహ, బోనగిరి జిల్లా సహాయ కార్యదర్శి కొండే శ్రీశైలం, నల్లగొండ జిల్లా కమిటీ సభ్యులు సాగర్ల మల్లేష్ ,ఎల్లాముల వెంకటేశం, బత్తుల వెంకటేశం వల్లూరి లింగస్వామి ,వల్లూరి వెంకటేశం, భీమగోని బాలరాజు యాదవ్ ,బద్దుల శంకర్, కడగంచి రాజు, కాసం జంగయ్య, కాసం వెంకటేశం ,చివర్ల వీరమల్లు ,గుండబోయిన ఐలయ్య ,తదితరులు పాల్గొన్నారు.