Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అర్వపల్లి
76 రోజుల నుండి తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం నేటికీ పరిష్కరించడం లేదంటూ వీఆర్ఏలు శనివారం మండలకేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు .ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం కోకన్వీనర్ చింతల వీరయ్య మండల అధ్యక్షులు సదయ గ్రామాలకు చెందిన వీఆర్ఏలు అశోక్ నర్సింగ్ విజయ్ వీరేష్ అశోక్. తదితరులు పాల్గొన్నారు.
చివ్వేంల : ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏలసమస్యలను పరిష్కరించాలని వీఆర్ఏల జిల్లా కో కన్వీనర్ దార సతీష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు శనివారం మండల కేంద్రంలోని వట్టి ఖమ్మం పహాడ్ క్రాస్ రోడ్ వద్ద రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు కాసాని వెంకన్న, నజీర్, శోభ ,సైదులు,నాగయ్య,సురేఖ,మహేష్, పాషా రాము, చివ్వెంల ఆత్మకూరు ,మోతె మండలాల వీఆర్ఏలు పాల్గొన్నారు.
నేరేడుచర్ల : ముఖ్యమంత్రి కేసిఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు అయిన పేస్కేలు అమలు,వారసత్వ ఉద్యోగాలు, అర్హులకు ప్రమోషన్లు,తదితర డిమాండ్ల అమలుకు గత 75 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏ లకు ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు శనివారం ు రాస్తారోకో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఏ ల మండల అధ్యక్షురాలు పెరుమాళ్ళ పిచ్చమ్మ ,లక్ష్మి , మణి, రాధ, శోభ, ఝాన్సీ ,చంద్రకళ, సైదా, నాగు ,అప్పయ్య, నాగు , ఖాదర్ , అంతయ్య, తదితరులు పాల్గొన్నారు.
నూతనకల్ : హామీలను వెంటనే నెరవేర్చాలని వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు ఎండి జాంగిర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .శనివారం మండల కేంద్రంలోని సూర్యాపేట దంతాలపల్లి ప్రధాన రహదారిపై నిర్వహించిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు గోరుగంటి మధుసూదన్ రావు, నాగేశ్వరరావు, సుధాకర్, మల్లేశ్వరి, సరిత, రజిత, ఇదప్ప, లింగయ్య, బిక్షం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హుజూర్ నగర్ : వీఆర్ఏలు చేస్తున్న సమ్మె 76వ రోజుకు చేరుకున్న సందర్భంగా శనివారం పట్టణంలోనే తహసిల్దార్ కార్యాలయం ముందు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించిన నిరసన తెలిపారు ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు తమ న్యాయమైన సమస్యలను వెంటనే నెరవేర్చారన్నారు ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కోకన్వీనర్ నరసింహారావు మండల అధ్యక్షుడు వీరబాబు చిన్న ఈదయ్య సతీష్ ఇబ్రహీం రంజాన్ నాగమ్మ కాసిం సైదులు, చెన్నయ్య రాంబాబు తదితరులు పాల్గొన్నారు.