Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తుంగతుర్తి:మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పల్లా సుదర్శన్ మాట్లాడారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు మోపడం మానుకొని స్వామినాథన్ కమిషన్ సిఫారసును అమలు చేసి,ధాన్యానికి గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు అధ్యక్షులుగా మిడిదొడ్డి సోమయ్య, కార్యదర్శిగా సత్తయ్య, ఉపాధ్యక్షులుగా పిచ్చయ్య, సహాయ కార్యదర్శిగా వెంకన్న లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.