Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూదాన్‌పోచంపల్లి
తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 3 వ మహాసభల సందర్భంగా ఈ నెల19న యాదగిరిగుట్టలో జరిగే భారీ ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాటూరి బాలరాజ్ గౌడ్,భువనగిరి జిల్లా అధ్యక్షులు రాగేరు కృష్ణయ్య పిలుపునిచ్చారు. గురువారం మండలకేంద్రంలోపోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూకల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న గీతకార్మికులకు గీతన్న బంధు ప్రకటించి పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని, వృత్తికి ఉపయోగపడే విధంగా ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నారని వీరికి బడ్జెట్లో 5 వేల కోట్ల రూపాయలు కేటాయించి సొసైటీలకు భూమి, కల్లు కు మార్కెట్, నీరా తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. 20, 21వ తేదీలలో రాష్ట్ర మూడవ మహాసభ నిర్వహిస్తున్నామని దీనికి అన్ని జిల్లాల నుండి సంఘం నాయకులు, ప్రతినిధులు వెయ్యి మంది హాజరవుతారని తెలిపారు.ఈ కార్యక్రమంలోపోచంపల్లి కల్లు గీత సొసైటీ అద్యక్షులు తంతరపల్లి వెంకటేష్ , మాజీ అధ్యక్షులు బండి యాదగిరి, కాండె యా దయ్య, చెరుకు అంజయ్య గొడయూత్ ప్రెసిడెంట్బండి మహేష్, బింగి సత్య నారాయణ, గడ్డం బాలరాజు, టి, శ్రీనివాస, బత్తుల శ్రీశైలం మాజీ సర్పంచ్, టి, బస్వయ్యతదితరులు పాల్గొన్నారు.
ఆలేరు టౌన్ : తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం అధ్వర్యంలో ఈనెల 19వ తేదీన యాదగిరిగుట్ట లో జరిగే బహిరంగ సభ ను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం పురపాలక సంఘం ఆలేరు, బహదూర్ పేట , సాయి గూడెం వద్ద రాష్ట్ర కమిటీ సభ్యులు దూపటి వెంకటేష్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ లను ఆవిష్కరించి ,ప్రచారం నిర్వహించారు ఈ కార్య క్రమంలో మండల అద్యక్షుడు పూజారి కుమార స్వామి,మండల కార్యదర్శి మిట్ట శంకరయ్య, నల్ల మాస తులసాయ్యా,బొమ్మ కంటి లక్ష్మీ నారాయణ, ఆరె రాములు,బొమ్మ కంటి సిద్ధులు ,సూ ద గాని లక్ష్మి నారాయణ , సూ దంతూరి వెంకటేష్, పల్లె సంతోష్, బండి రాములు, సూ ద గాని పర్ష రా ములు , దొంకెన మహేష్, బీమా గాని నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేట : ఈనెల 19న నిర్వహించే కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ ను గురువారం మండలంలోని ఉత్తటూరు గ్రామంలో గీత కార్మికులతో ఆ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పులి బిక్షం, సంఘం మండల అధ్యక్షులు ఎర్ర రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మూడవ మహాసభల సందర్భంగా 19న యాదగిరిగుట్టలో జరిగే భారీ ప్రదర్శన, బహిరంగ సభను జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పబ్బు శేఖర్, పబ్బు బిక్షం, గడ్డమీద సత్తయ్య, మునుకుంట్ల శివ, తదితరులు పాల్గొన్నారు.
వలిగొండ : తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మూడవ మహాసభలు ఈ నెల19, 20, 21 తేదీలలో యాదగిరిగుట్టలో నిర్వహించనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య జిల్లా ఉపాధ్యక్షులు పబ్బతి మల్లేశం తెలిపారు గురువారం మండల కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం జయప్రదం కోరుతూ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గీత కార్మికులకు గీతన్న బంధు ప్రకటించాలన్నారు కార్మికులందరికీ ఉచితంగా బైక్ లు ఇవ్వాలని కల్లుగీత కార్మిక రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ ఏర్పాటుకు రూ 5 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి గాజుల ఆంజనేయులు మండల కోశాధికారి పాలు చన్ స్వామి మండల కమిటీ సభ్యులు లోడ మల్లేశం గాజుల వెంకటేశం తూర్పు నూరి శంకరయ్య ధనంజయ బిక్షపతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.