Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి మల్లారెడ్డి సమక్షంలో వేతన ఒప్పందం చేసుకున్న యాజమాన్యం
- సీఐటీయూ పోరాట ఫలితమే వేతనాల పెంపు
నవతెలంగాణ - చౌటుప్పల్ రూరల్
ప్రతిష్ట ఇండిస్టీస్ కార్మికులు చేపట్టిన సమ్మె 22వ రోజు మంత్రి మల్లారెడ్డి జోక్యంతో కార్మికుల సమ్మె విరమించారు. కంపెనీ యాజమాన్యం నూతన వేతన ఒప్పందం చేసుకోవాలని గత 22 రోజులుగా సమ్మె చేపట్టారు. కార్మికుల పక్షాన కార్మిక శాఖ మంత్రి చామకూరి మల్లారెడ్డి సమక్షంలో యాజమాన్యం చర్చలు జరిపింది. కార్మికులతో నూతన వేతన ఒప్పందం కుదుర్చుకుంది. కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా ఉన్న జీతానికి అదనంగా రూ.3200 లను పెంచుతూ అంగీకరించారు. ప్రతి రెండు సంవత్సరాలకు కార్మికులకు నూతన వేతన ఒప్పందం చేసుకునేలా యాజమాన్యంతో మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. కంపెనీల యజమాన్యాలు కార్మికుల సంక్షేమానికి కూడా కృషి చేయాలని కోరారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సమక్షంలో జరిగిన చర్చల్లో జెసిఎల్ శత్రువేది, ప్రతిష్ట ఇండిస్టీస్ ఎండి రాజా కిరణ్, సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి దాసరి పాండు,ఉపాధ్యక్షులు కల్లూరు మల్లేశం, యూనియన్ అధ్యక్షులు ఎండి పాషా, ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశం, నాయకులు యాదయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.