Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం చింతకింది వేంకటేశ్వర్లు కృషిచేశారని చేనేత సంఘం నాయకులు , మాజీ సర్పంచ్ చింతకింది మురళి అన్నారు. మండల కేంద్రంలో గురువారం చేనేత సహకార సంఘంలో ఆధ్వర్యంలో చింతకింది వెంకటేశ్వర్లు రెండవ వర్ధంతి సభ , సంఘం కార్యదర్శి ఎలగందుల రామఋషీ అధ్యక్షతన నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి చేనేత కార్మికులు ఘనంగా నివాళులర్పించారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చేనేత కళాకారుల కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన సేవలను స్మరిస్తూ కొనియాడారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ ,కౌన్సిలర్ బేతి రాములు , చేనేత సంఘం సభ్యులు ఆడేపు బాలస్వామి, బింగి రవి, చింతకింది కవిత, గుజ్జ అశోక్, రేగోటి వెంకటేశం, అంకం మల్లేశం, గుజ్జ పద్మ, రచ్చ సత్యనారాయణ, కర్రే ఎల్లయ్య ,చింతకింది రామానుజం, దాసి శంకర్ , పద్మ సుదర్శన్, బేతి సత్యనారాయణ, చిట్టి మిల్ల కృష్ణ ,పసునూరి యాదగిరి, బింగి శ్రీనివాస్, బేటి వెంకటేష్ ,చింతగింది గిరిప్రసాద్, బేతి ఆంజనేయులు, చింతకింది రంగ ,చింతకింది నరసింహులు, వార్డ్ నెంబర్ సత్యనారాయణ ,మడూరి యాదగిరి ,పామ్ మార్కండేయ, బేతి శీను ,ఎలగదుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.