Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భూధాన్పోచంపల్లి
ప్రభుత్వం ధరణిలో లోపాలను సవరించి వెంటనే భూ సమస్యలను పరిష్కరించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్ అన్నారు. గురువారం మండలకేంద్రంలోని పెద్దన్న భవనంలో రైతు సంఘ ద్వితీయ మండల మహాసభ గూడూరు బుచ్చిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామినాథన్ కమిషన్ రిపోర్టులను అమలు చేస్తానని హామీ ఇచ్చి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ రైతులకు ఇచ్చే ఎరువులు పురుగుల మందులు సబ్సిడీని ఎత్తి వేసి ధరలను పెంచిందన్నారు. రైతు సంఘం రాష్ట్ర మాజీ నాయకులు గూడూరు అంజిరెడ్డి జెండా ఆవిష్కరించి సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వాలు రైతుల సంక్షేమ ప్రభుత్వాలని చెప్పడం తప్ప రైతులకు చేసిందేమీ లేదన్నారు. పంటకు క్వింటాలుకు సుమారు 2500 నుండి 3000 రూపాయలు ఇచ్చినట్లయితే రైతులకు అంతో కొంత గిట్టుబాటు ధర లభిస్తుందన్నార. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు పగిళ్ల లింగారెడ్డి, సింగల్ విండో డైరెక్టర్ అందేలా జ్యోతి ,నాయకులు పురుషోత్తం రెడ్డి ,చిన్న లచ్చి స్వామి, బాత్క బిక్షపతి, గుర్రం రామచంద్ర రెడ్డి ,జంగారెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.