Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లెవెన్ కేవి విద్యుత్‌వైరు తెగినా పట్టించుకోని వైనం
- ఇబ్బందులు పడుతున్న రైతులు
నవతెలంగాణ-పెద్దవూర
పెద్దవూర మండల కేంద్రంలోని జయరాంతండ గ్రామ శివారులో 10 రోజుల పాటు కురుస్తున్న వర్షాల కారణంగా లెవెల్ కేవీ కరెంటు వైర్ తెగి ప్రమాదకరంగా మారిందని ఎన్నిసార్లు లైన్మెన్కు ఫోన్ చేసినా ఫోన్ లేపకుండా రైతులకు సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు తెలియజేసిన, కరెంట్ హెల్పర్లకు తెలియపరిచిన లైన్మెన్ ఎల్సీ ఇస్తేనే చేస్తామని కరెంట్ హెల్పర్లు చెపుతున్నారని రైతులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం పొట్టిచేల్మ సబ్ స్టేషన్లో డ్యూటీ టైంలో మద్యాపానానికి బానిసైన లైన్ మెన్ మంచానికే పరిమితమయ్యారని ఆరోపించారు. పొట్టిచెలమ్మ, పర్వేదుల గ్రామాల కరెంట్ సబ్ స్టేషన్‌కు లైన్మెన్గా ఉన్న అతను మద్యం సేవించి రైతులను ఇబ్బంది పెట్టారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఏడీకి పిర్యాదు చేశామని రైతులు తెలిపారు. కరెంట్ లైన్మెన్ చట్టరీత్య చర్య తీసుకొని రైతులకు న్యాయం చేయాలని కరెంట్ ఏడీకి జయరాంతండ రైతులు విన్నవించుకున్నారు. ఏడీని సంప్రదించిన తర్వాత కరెంట్ హెల్పర్లు వచ్చి సమస్యను పరిష్కారం చేశారని రైతులు తెలిపారు. ఇలాంటి లైన్మెన్ పై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
లైన్ మెన్ పై చర్యలు తీసుకోవాలి:రమావత్ శ్రీను (జయరాంతండ)
మద్యం సేవించి లెవెన్ కేవి విద్యుత్ వైరు తెగినా పట్టించుకోకుండా రైతులకు ఇబ్బంది కలిగించిన లైన్ మెన్‌పై చర్యలు తీసుకోవాలి. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత. డ్యూటీలో వున్నప్పుడు మద్యం సేవించి పడుకున్న అతని పై చర్యలు తీసుకోవాలి.