Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడు అభివృద్ధి చెందింది పాల్వాయి హయాంలోనే..
- కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కోకిరాల సురేఖ ప్రేమ్ సాగర్‌రావు
నవతెలంగాణ-మునుగోడు
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా తుదిశ్వాస విడిచే వరకు కృషిచేసిన దివంగత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురును కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని అభివృద్ధి చేసేందుకు ఆశీర్వదించాలని మంచిర్యాల కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కోకిరాల సురేఖ ప్రేమ్ సాగర్‌రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని సంతలో చిరు వ్యాపారులను, సంతకు వచ్చిన ప్రజలను స్రవంతికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హయంలోనే అభివృద్ధి చెందింది తప్ప నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఎమ్మెల్యేగా గెలిపించుకున్న బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభివృద్ధి చేసింది ఏమీ లేదు కానీ డబ్బు మద్యం ప్రలోభ పెట్టి ప్రజలు మోసం చేసేందుకు వస్తున్న రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అషీరాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ గణేష్ రాథోడ్, చెన్నూరు ఇంచార్జ్ నూకల రమేష్, బూత్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ అశోక్, బెల్లంపల్లి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ మహేందర్, అదిలాబాద్ ఇంచార్జ్ గండ్ర సుజాత తదితరులున్నారు.