Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యావత్ భారత ప్రజానీకమే కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతోంది.
- ప్రజలతో బీజేపీ నాయకులు చెలగాటమాడుతున్నారు..
- కులమత రాజకీయాలకు తెలంగాణలో తావులేదు..
- రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త
నవతెలంగాణ-మునుగోడు
టీిఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త కోరారు. గురువారం మండల కేంద్రంలోని మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్యవైశ్య సంఘం ముఖ్య నాయకులను, కార్యకర్తలను కలిసి షాప్స్, ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలతో బీజేపీ నాయకులు చెలగాటమాడుతున్నారు. కులమత రాజకీయాలకు తెలంగాణలో అడుగుపెట్టనివ్వకుండా తరిమి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీతోనే మన ప్రాంత అభివద్ది సాధ్యమవుతుందని తెలిపారు. పగటి కలలు కంటున్న బీజేపీ నాయకులకు మునుగోడులో పట్టపగలే చుక్కలు లెక్క పెట్టుకునే విధంగా తీర్పు ఇవ్వాలన్నారు. ఆర్యవైశ్యులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలంటే ఒక్క టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, మునుగోడు నియోజకవర్గ పరిధిలోని ఆర్యవైశ్య సోదరులు అందరూ ప్రభాకర్‌రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మునుగోడు మండల అధ్యక్షుడు వై.సురేష్ కుమార్ గుప్త, సెక్రెటరీ ఎస్ .రాము, ఉపాధ్యక్షులు జీ.కిషన్, ట్రెజరర్ పీ.శ్రీకాంత్, చిన్నస్వామి, సుదర్శన్, పుల్లయ్య, నవీన్‌కుమార్, ఈశ్వరయ్య, వెంకటేశ్వర్లు, జిందం వేణు, సాంబశివరావు, శ్రావణ్‌కుమార్, మహేష్ గుప్త, ఆర్యవైశ్య సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.