Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునుగోడు
కేంద్ర బీజేపీ మంత్రులు, రాష్ట్రంలోని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వచ్చినా సరే ప్రజలు వారిని నమ్మకుండా బహుజనున్ని గెల్పించుకోవాలని మునుగోడు నియోజకవర్గం ప్రజలు బీఎస్పీ వైపు చూస్తున్నారని ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం బహుజన రాజ్యాధికార యాత్ర రెండవ విడతలో భాగంగా మునుగోడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీిఆర్ఎస్, బీజేపీ ఇతర పార్టీలన్ని డబ్బు మద్యం పంచుతూ ప్రజల దగ్గరకు వెళ్తే, మేం మాత్రం కష్టాలు కన్నీళ్లు తుడవడానికి వెళ్తున్నామని తెలిపారు. మహనీయుల సిద్ధాంతం, కష్టించి పనిచేయడం, నిజాయితీ మా బలం అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కన్వీనర్ నర్ర నిర్మల, జిల్లా నాయకులు భీంప్రసాద్, మండల నాయకులు హరీష్, వెంకన్న, సురేష్ తదితరులు పాల్గొన్నారు.