Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.18 వేలకోట్లకు అమ్ముడుపోయినోడికి తగిన బుద్ధి చెప్పాలి
- మునుగోడు గడ్డ కమ్యూనిస్టుల కంచుకోట
- మంత్రి చామకూరి మల్లారెడ్డి
నవతెలంగాణ- చౌటుప్పల్ రూరల్
గత పాలకుల హాయంలో మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి చెందలేదు. ఈ ప్రాంతమంతా ఫ్లోరోసిస్ సమస్యతో నిండి ఉండేది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మునుగోడు అభివృద్ధి చెందిందని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూరి మల్లారెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం గుండ్ల బావి, సైదాబాద్, ఆరెగూడెం గ్రామాల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కోసం వెళ్లే బైక్ ర్యాలీని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్లో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి ఒరగబెట్టింది ఏమీ లేదని ఎదవ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచి కూడా ఆయన చేసేదేమీ లేదని విమర్శించారు. 18 వేల కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డికి మునుగోడులో ప్రజల దగ్గరకు వెళ్లి ఓటు అడిగే నైతిక లేదని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్ రాదని తెలిపారు. ప్రజలంతా కేసీఆర్ అభివృద్ధికి బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. మునుగోడు గడ్డ కమ్యూనిస్టుల కంచుకోటగా ఉందని, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఆటలు సాగవని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి మంద సంజీవరెడ్డి, గ్రామ సర్పంచ్ మునగాల ప్రభాకర్ రెడ్డి, బచ్చా రామకృష్ణ, మాజీ సర్పంచ్ నందగిరి మహేశ్వరి శ్యాంప్రసాద్, గ్రామ శాఖ అధ్యక్షులు ఎన్నపల్లి ముత్యంరెడ్డి, మాజీ సర్పంచ్ జాల మల్లేష్, నాయకులు భీమిడి వెంకటరెడ్డి, శేఖర్, ఆగి రెడ్డి, భూపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, దుర్గం రాజు, యుద్ధం రెడ్డి, నందగిరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.