Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
పట్టణంలోని విద్యానగర్ కాలానికి చెందిన మాజీ కౌన్సలర్ దరావత్ భాస్కర్ ఏకైక కుమారుడుని హత్య చేసిన కులదురంకారులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఆ పార్టీ జిల్లా కార్యాలయం లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 9న అర్ధ్థ రాత్రి కిడ్నాప్ చేసి హత్య చేసి సాగర్ కాలువలో వేసి నేటికీ నాలుగు రోజులు కావస్తున్నా ఇంతవరకు దుండగులను గుర్తించక పోవడం అన్యాయన్నారు. శవ పంచనామ రిపోర్టులో ఏముందో ఎందుకు భయట పెట్టలేక పోతున్నారన్నారు. సీసీ పుటేజ్ లో రాత్రి 11.30 గంటల వరకు జనగామ క్రాస్ రోడ్డు లో మిత్రులతో టు విల్లర్ పై తిరిగి నట్లు గుర్తించినప్పటికీ వారెవ్వరూ అనేధి తెల్పలన్నారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఒక గిరిజన యువకున్ని మరణం మిస్టరీగా ఉండటం ఏమిటని ఆయన ప్రశ్నించారు.బాధితుని కుటుంభానికి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.లేకుంటే పెద్దఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా నాయకులు నెమ్మాధివెంకటేశ్వర్లు, ఏల్గురి గోవింద్ , ఎం శేఖర్, రజిత, వీరబోయిన రవి తదితరులు పాల్గొన్నారు.
అన్ని గ్రామాల్లో తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
సూర్యాపేట రూరల్ :అన్ని గ్రామాలలోనూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. .గురువారం జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో తెలంగాణ రైతు సంఘం సూర్యాపేట పట్టణ, మండల మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే అన్ని గ్రామాలలో యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని అన్నారు. రైతాంగాన్ని ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులు పండించిన అన్ని రకాల పంటలకు మద్దతు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఆరోపించారు. స్వామినాథన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణ రైతు సంఘం అధ్యక్షునిగా గట్టుపల్లి సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పందిరి సత్యనారాయణ రెడ్డి, సూర్యాపేట రూరల్ రైతు సంఘం మండల అధ్యక్షునిగా నాగిరెడ్డి శేఖర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిగా మాలి బుచ్చి రామ్ రెడ్డి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొప్పుల రజిత, జిల్లా సహాయ కార్యదర్శి మందడి రామ్ రెడ్డి, సిఐటియు జిల్లా నాయకులు మేకనబోయిన శేఖర్ ,మండల నాయకులు నంద్యాల కేశవరెడ్డి, నారాయణ వీరారెడ్డి ,చెట్లంకి యాదగిరి ,బొల్లా నాగేందర్ రెడ్డి, నర్రా అంజయ్య, పల్స సురేందర్, పేరెల్లి అంజయ్య, చింతలపాటి రత్నం, కన్నెబోయిన శీను, రెడ్డి మోహన్ రెడ్డి ,పిండిగా జానయ్య, వాంకుడోత్ శ్రీను ,వాంకుడోత్ హనుమ, చిట్లంకి శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.