Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ హేమంత్ కేశవ్‌పాటిల్
నవతెలంగాణ- సూర్యాపేట కలెక్టరేట్
జిల్లా అభివృద్ధికి పక్కాగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన కోదాడ, హుజూర్నగర్ మున్సిపాలిటీల యొక్క మాస్టర్ ప్లాన్ తయారీపై స్టేట్ హోల్డర్స్‌తో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్నగర్ పురపాలక అభివృద్ధి కోసం సంబంధిత శాఖలు వారి డేటాను మున్సిపల్ కమిషనర్లకు అందజేయాలన్నారు. ఆ డేటాను పరిశీలించి మున్సిపల్ సిబ్బంది హైదరాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ వారికి అందజేస్తారని తెలిపారు. సూర్యాపేట జిల్లాలోని అర్బన్ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని వాటికి అనుకూలంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగుంట కండ్ల జగదీశ్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ అధికారులు మాస్టర్ ప్లాన్ రూపిందిస్తున్నట్టు తెలిపారు. ప్లాన్ తయారు చేయు విధానాన్ని జెడ్టీపీ రమేష్ బాబు , డీటీసీపీ ఆర్.రాహుల్ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా సంబంధిత అధికారులకు వివరించారు.ఈ కార్యక్రమంలో కొత్త శ్రీనివాస్ ఎన్ ఐ యు ఎం ప్లానర్, యు ఎల్ బి స్టాఫ్,ఆర్డిఓలు రాజేంద్ర కుమార్, వెంకారెడ్డి, కిషోర్ కుమార్,సిపిఓ వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి అధికారి యాకుబ్,పిఆర్ శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ డి రామారావు నాయక్, కోదాడ కమిషనర్ డి మహేశ్వర్ రెడ్డి, హుజూర్నగర్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.