Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-సూర్యాపేట
తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 3 వ మహాసభల సందర్భంగా అక్టోబర్ 19న యాదగిరిగుట్టలో జరిగే భారీ ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక చేతివృత్తిదారుల భవనంలో జిల్లా అధ్యక్షుడు ఎల్గూరు గోవిందు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న గీతకార్మికులకు గీతన్న బంధు ప్రకటించి పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని, వృత్తికి ఉపయోగపడే విధంగా ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నారని వీరికి బడ్జెట్లో 5 వేల కోట్ల రూపాయలు కేటాయించి సొసైటీలకు భూమి, కల్లు కు మార్కెట్, నీరా తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అన్నారు. పెన్షన్ 5 వేలకు, ఎక్స్ గ్రేషియా పది లక్షలకు పెంచాలన్నారు.జిల్లా అధ్యక్షులు ఎల్గూరి గోవిందు మాట్లాడుతూసర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించాలని , కల్లులోని పోషకాలను, ఔషధ గుణాలను ప్రభుత్వమే ప్రచారం చేసి మార్కెట్ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అబ్బ గాని బిక్షం, తుమ్మల సైదయ్య, కొండ అన్నపూర్ణ ,జర్రిపోతుల కృష్ణ, సహాయ కార్యదర్శిలు ఉయ్యాల నగేష్, మడ్డి అంజిబాబు ,బత్తుల జనార్ధన్, బట్టిపల్లి నాగమల్లయ్య ,నోముల వెంకన్న, బెల్లంకొండ ఇస్తారు ,బెల్లంకొండ వెంకటేశ్వర్లు, బొల్లెపల్లి శ్రీను ,మట్టపల్లి సిద్దయ్య ,మామిడి వెంకట్, బొమ్మగాని కవిత ,గుణగంటి వెంకన్న, బుర్ర ఎల్లా గౌడ్ ,సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ తండ రమేష్, కో కన్వీనర్ చెన్నగాని ఉస్మాన్, కాసాని వీరస్వామి ,దోనేటి పిచ్చయ్య, పొడిసెట్టి సైదులు, అబ్బ గాని కాశయ్య, కుక్కడపు రామకృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు.