Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ
కోదాడరూరల్:డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు విషయంలో ఎలాంటి పైరవీలు ఉండవని మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 1,4,7, 10, 13,16, 19,22,25,27,30,33 వార్డులలో ఏర్పాటుచేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక సభలో ఆమె మాట్లాడారు. పేద వారి సొంత ఇంటి కలను నిజం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. అర్హులకు అందించడానికి దరఖాస్తులు స్వీకరించి వివిధ దశల్లో సర్వేలు నిర్వహించి వార్డు సభల ఆధారంగా పూర్తి పారదర్శకంగా అర్హుల జాబితాను సిద్ధం చేసినట్టు తెలిపారు. ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సంఖ్యకంటే అర్హుల జాబితా అధికంగా ఉన్నందున ప్రజలందరి సమక్షంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పక్రియకై డ్రా పద్ధతి ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డ్ కౌన్సిలర్ లు , మునిసిపల్ అధికారులు, లబ్దిదారులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.