Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునుగోడు
అదనపు కట్నం కోసం భార్యపై రాడుతో దాడి చేసి హత్య చేసిన సంఘటన గురువారం మండలంలోని రావిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన చందనను (25) రావిగూడెం గ్రామానికి చెందిన గుర్రం హరికృష్ణకు 2016లో 10 లక్షల కట్నం, పదితులాల బంగారం ఒప్పుకొని తల్లిదండ్రులు వివాహం చేశారు. హరికృష్ణ హైదరాబాదులో కంప్రెషర్ ట్రాక్టర్ నడుపుతూ జీవనం కొనసాగించేవాడు. వ్యాపారంలో భాగంగా హరికృష్ణ చేసిన అప్పులను అత్తగారు ఇచ్చిన కట్నంతో తీర్చుకోగా హరికృష్ణ తండ్రిపై ఉన్న ఎకరం భూమిని మృతురాలు చందన పేరుమీద రిజిస్ట్రేషన్ చేయగా గత 15 రోజుల క్రితం తిరిగి భర్త హరికృష్ణ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దీంతో ఏర్పడిన కుటుంబ కలహాలతో చందనపై గురువారం తెల్లవారుజామున రాడుతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి మృతి చెందింది. తెల్లవారుజామున చందన అత్తమామ చూసేసరికి రక్తపు మడుగులలో విగత జీవిగా కనిపించడంతో భయాందోళనకు గురైన అత్తమామలు బోరుణ వినిపించడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి స్థానిక ఎస్సై సతీష్ రెడ్డి పంచనామ నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆ గ్రామపంచాయతీ ట్రాక్టర్లో నల్లగొండకు తరలిస్తుండగా బంధువులు మార్కెట్ యార్డ్ సమీపంలో అడ్డుకొని కుటుంబ సభ్యుల సమక్షంలో పంచనామా నిర్వహించకుండా తమ కూతుర్ని పోస్టుమార్టంకు ఎలా తీసుకెళ్తారని పోలీస్ స్టేషన్ ఎదుట రాస్తారోకో చేశారు. అయినప్పటికీ లాండ్ ఆర్డర్ పేరుతో మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించేందుకు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండకు తరలించారు. పోలీసుల తీరుపై కుటుంబ సభ్యులు బంధువులు ఆగ్రహానికి గురై ఆందోళన చేశారు. అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. దీంతో ఎస్సై సతీష్ రెడ్డి పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమనిగింది. మృతురాలికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారు. తల్లి లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.