Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగా-మిర్యాలగూడ
మిర్యాలగూడను తక్షణమే జిల్లాగా ప్రకటించాలని, అలా ప్రకటిస్తే అన్ని వసతులు వస్తాయని బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లుముదిరాజ్, ఎంఐఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ ఫరూక్ అన్నారు. 96 వ రోజు గురువారం ఉద్యమంలో భాగంగా వాగ్దేవి జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ జిల్లా అయితే, సాఫ్ట్ వేరు కంపెనీస్ వస్తాయని, మేడికల్ కాలేజ్ వస్తుందని చెప్పారు. ఉన్నత విద్య కళాశాలలో ఏర్పడతాయని, అన్ని శాఖల జిల్లా కార్యాలయాలు వస్తాయని, పరిపాలన పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. జిల్లా పోస్టులల్లో 95శాతం ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎరుకల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు వజ్రగిరి అంజయ్య, కళాశాల విద్యార్థులు, సాయి ప్రభాస్, అజీమ్, బాలాజీ, మణికంఠ, అభిలాష్ రెడ్డి, అశ్వంత్కుమార్, మణికంఠ, గని నాయక్, ప్రవీణ్, సమీర్, సాయి ప్రణరు, అరుణ్, నాగరాజు, నరేష్, నందు, బీ.మణికంఠ, మురళీదర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.