Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండు మహాసభలు జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ కందాల ప్రమీల పేర్కొన్నారు. గురువారం స్థానిక నర్ర రాఘవరెడ్డి భవన్లో రైతు సంఘం రెండవ మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలు నవంబర్ 8 నుండి 10వ తేదీ వరకు నల్లగొండ పట్టణంలో జరుగుతున్నాయన్నారు.ఈ మహాసభలు రైతాంగాన్ని సంఘటిత పరిచి సమస్యల పరిష్కారానికి దోహదపడతాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించడంలో సవతితల్లి ప్రేమను కనబరుస్తుందని విమర్శించారు. వ్యవసాయం రంగం నుండి రైతులను దూరం చేసేందుకు ఆ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్పజెప్పేందుకు కుట్ర చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు యానాల కృష్ణారెడ్డి, మండల అధ్యక్ష, కార్యదర్శులు యానాల రంగారెడ్డి, మర్రి వెంకటయ్య, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు ఒంటెపాక వెంకటేశ్వర్లు, వంటేపాక కృష్ణ, గింజల లక్ష్మీ, నరసింహరెడ్డి, లక్ష్మీనరసయ్య, తదితరులు పాల్గొన్నారు.