Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతోన్మాద బీజేపీని ఓడించాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్
నవతెలంగాణ-సంస్టాన్నారాయణపురం
మూడున్నరేండ్లుగా మునుగోడు ప్రజల సమస్యలను పట్టించుకోని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఓట్లు అడిగే హక్కు లేదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరికిషోర్,టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు.శుక్రవారం మండలంలోని రాచకొండ, కడీలబాయితండా, తుంబాయితండా, వెంకాంబాయితండా,కంకణాలగూడెం, చిమిర్యాల,గుడిమల్కాపురం గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వారు మాట్లాడారు.మునుగోడు అభివృద్ధి పేరు చెబుతూ రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసం బీజేపీలో చేరిన రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని ఆ పార్టీకి తాకట్టు పెట్టారని విమర్శించారు.దేశంలో ఎనిమిదిన్నరేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చక పోను నిత్యావసర వస్తువుల, గ్యాస్, పెట్రోల్,డీజిల్ ధరలను పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు.మతోన్మాదదాడులకు పాల్పడుతుందన్నారు.2014లో తాను ఎమ్మెల్యేగా గెలుపొందాక మునుగోడు నియోజకవర్గం నిర్మించ తలపెట్టిన చర్లగూడెం, కిష్టరాంపల్లి తదితర ప్రాజెక్టులకు రూ.2వేల కోట్లు మంజూరు చేయిస్తానని చెప్పాడన్నారు.2018లో ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజగోపాల్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోను మునుగోడు అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.ప్రభుత్వపరంగా అతనికి వచ్చిన అభివృద్ధి నిధుల్లో నుంచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదన్నారు.పొరపాటున బీజేపీకి ఓట్లేస్తే రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తారన్నారు.టీఆర్ఎస్ను గెలిపిస్తే ఆగి ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయిస్తానన్నారు.కారు గుర్తుకు ఓటేసీ తనను గెలిపించాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుత్తాఉమాదేవి, జెడ్పీటీసీ వీరమల్ల భానుమతి,సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కమిటీ సభ్యులు గుంటోజు శ్రీనివాసచారి, సీపీఐ నాయకులు బచ్చనగోని గాలయ్య, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.