Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాటమీద నిలబడని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఓడించండి
- రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్‌రూరల్
తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూరి మల్లారెడ్డి అన్నారు.శుక్రవారం ఆయన మండలంలోని ఆరెగూడెం, కాట్రేవు గ్రామాల్లో సీపీఐ(ఎం) నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.గత పాలకులు సాగు నీరివ్వక తెలంగాణ ఎడారి ప్రాంతాన్ని తలపించేదన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలనంలో రాష్ట్రం సస్యశ్యామలమైందని తెలిపారు. ధాన్యాగార రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందని చెప్పారు.మునుగోడు ఎమ్మెల్యేగా పనిచేసిన రాజగోపాల్‌రెడ్డి ప్రజా సమస్యలు పరిష్కరించలేక రాజీనామా చేశారని ఎద్దేవా చేశారు.ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెటు ్టకోకుండా, వేలకోట్ల రూపాయలకు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి అమ్ముడుపోయారని ఆరోపించారు.ఈ ప్రాంత ఎంపీ,ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పనిచేసిన రాజగోపాల్‌రెడ్డి చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు వివరించాలన్నారు.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దోచుకొని దాచుకున్నారని విమర్శించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెలిపారు.దళిత ఓట్లతో ఇన్నాళ్లు గెలిచిన పాలకులు దళితుల సంక్షేమానికి వర్గబెట్టిందేమీ లేదన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత కుటుంబాలను ఆర్థికంగా అభివద్ధి చేయడం కోసం దళితబంధు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మోసగాడని అభివర్ణించారు. మునుగోడు ఉపఎన్నికల్లో అతనికి డిపాజిట్ దక్కకుండా ప్రజలు పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మునగాల ప్రభాకర్‌రెడ్డి, బచ్చా రామకృష్ణ, ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మెన్ జక్కా వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్ జాల మల్లేశం, కార్పొరేటర్ బుచ్చియాదవ్,టీఆర్ఎస్ నాయకులు కొలనుఆగిరెడ్డి, ఎన్నపల్లి ముత్తిరెడ్డి, మునగాల దామోదర్‌రెడ్డి, కొత్తరాజు, గంగనబోయిన రమేష్, బచ్చమల్లేశం, యాదయ్య, భూపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, దుర్గంరాజు, చీనాల శ్రీశైలం, అనంత మల్లేశం తదితరులు పాల్గొన్నారు.