Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్షంలో తడుస్తూ ప్రచారం నిర్వహించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-నాంపల్లి
మునుగోడు ఉపఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి నాంపల్లి మండలంలోని చల్లవానికుంట గ్రామపంచాయతీలో వర్షం కురుస్తున్నప్పటికీ తడుచుకుంటూ ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ప్రజలు ఆట పాటలతో, కోలాటలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణను అభివద్ధి చేస్తున్నారని, అభివద్ధిని ఓర్వలేక బీజేపీ ప్రభుత్వం తెలంగాణకి నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుందన్నారు. గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచి సామాన్యుల మీద అధిక భారం వేసి ఆధాని, అంబానీల అప్పులు మాఫీ చేస్తూ పెదవారిని మరింత అణగ తొక్కుతూ రాక్షస ఆనందం పొందుతుందన్నారు. బీజేపీకి ఓటు వేస్తే మోటర్లకు మీటర్లు ఖాయమని అందుకే కేసీఆర్ నిలబెట్టిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి జెడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వరరెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్.కె అబ్బాస్, చల్లవానికుంట సర్పంచ్ దేవేంద్ర సత్యనారాయణ, నామానాయక్ తండా సర్పంచ్ సుగునాశంకర్, గ్రామశాఖ అధ్యక్షులు నరేష్, గిరి, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.