Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునుగోడు
ముదిరాజులకు పెద్దపీట వేసినది కేసీఆర్ అని ఎమ్మెల్సీలు బండ ప్రకాశ్ ముదిరాజ్, తాతా మధు, నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ముదిరాజుల సంక్షేమం కోసం కృషి చేయలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ముదిరాజులను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉచిత చేపల పిల్లలతో పాటు సబ్సిడీ వాహనాలను అందించిందన్నారు. శుక్రవారం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా మండలంలోని కొంపల్లి గ్రామంలో కొంపెల్లి, కల్వకుంట్ల గ్రామ ముదిరాజులతో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనలో వారు మాట్లాడుతూ ముదిరాజ్‌ల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ కోకాపేటలో ముదిరాజ్‌లకు ఏడు అంతస్థుల భవన నిర్మాణంకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో ప్రారంభమైందని తెలిపారు. రాజీనామాతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది అనుకుంటే ఈటెల రాజేందర్, రఘునందన్‌రావు, రాజాసింగ్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏనాడు కూడా ముదిరాజ్ అనే పేరు పెట్టుకొని, ఉచ్చరించని నాయకులు హుజూరాబాద్ ఎన్నికల్లో ముదిరాజ్లమని గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గ ముదిరాజ్ లంతా కేసీఆర్ వైపే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు వెలుగు రవిముదిరాజ్, మహాసభ యువత అద్యక్షులు బోళ్ళ వెంకట్ ముదిరాజ్, రాష్ట్ర యువత అధ్యక్షులు డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ యువత ప్రధాన కార్యదర్శి అల్లుడు జగన్ ముదిరాజ్ కోఆర్డినేటర్ బొక్క శ్రీనివాస్ ముదిరాజ్ ఉపాధ్యక్షులు ఆకుల రాజేశ్ముదిరాజ్, నారబోయిన రవిముదిరాజ్, రాష్ట్ర నాయకులు దమ్మిగారి కనకయ్య ముదిరాజ్, బైరి బలరాంముుదిరాజ్ పాల్గొన్నారు.