Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసరా పింఛనుతో ఆత్మ గౌరవాన్ని పెంచిన కేసీఆర్
- ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
నవతెలంగాణ-మునుగోడు
ప్రభుత్వం నుండి నియోజకవర్గంలోని ప్రజలకు మంజూరైన పథకాలను అందించలేని అసమర్ధులను ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిపించుకోవడం దురదృష్టకరమని పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని వెల్మకన్నె, చల్మెడ గ్రామాల్లో గడప, గడపకి తిరుగుతూ గత ఎనిమిది ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వపరంగా వచ్చిన అభివృద్ధిని కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజగోపాల్ రెడ్డి చేయలేకపోయారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల, వికలాంగుల ఆత్మగౌరవాణి పెంపొందించేందుకు ఆసరా పింఛన్ అందించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను మునుగోడు ప్రజలు ఆదరించాలన్నారు. బీజేపీ పాలిస్తున్న గుజరాత్ రాష్ట్రంలో వికలాంగులకు 500 పింఛన్ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర తరహాలో పింఛన్ అందించాలని మోడీకి సొంత రాష్ట్ర ప్రజలు నిలదీస్తున్నారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.