Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
కల్లు గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తున్నానని తెలంగాణ గౌడ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణగౌడ్ అన్నారు.మండలకేంద్రంలో శుక్రవారం ఆ సంఘం కార్యాలయం ఆవరణలో ఆ సంఘం సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.కల్లు గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు .గీత కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు . కళ్లు సేవించడం ద్వారా ప్రజలకు ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు.సీ,డీ విటమిన్ లభిస్తుందన్నారు.తాటికల్లు రోగ నిరోధకశక్తిని పెంపొందిస్తుందన్నారు.శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బొరేట్స్, ఐరన్, క్యాల్షియం, శరీరానికి కావాల్సిన సూక్ష్మదాతువులు ప్రకృతి ద్వారా అందించే దివ్య ఔషదం కల్లు అన్నారు.ఒకేతాటిచెట్టు కల్లును 40 రోజులు సేవించడం ద్వారా కిడ్నీ సమస్యలు దూరమవుతాయన్నారు.అధిక బరువు, మలబద్దకం తొలగిపోతుందన్నారు.రోగనిరోధక శక్తి పెరపొందించేందుకు ఉదయం కల్లు వాడితే ఆరోగ్యానికి వరప్రదాయనిగా పనిచేస్తుందన్నారు.అనంతరం ఆహ్వానితులకు శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు ఘనగాని శంకర్‌గౌడ్,సంఘం నాయకులు భిక్షపతిగౌడ్, మధుగౌడ్, ప్రభాకర్‌గౌడ్, మొరిగాడి మహేష్‌గౌడ్, మొరిగాడి అజయ్‌గౌడ్, మొరిగాడి వెంకటేష్‌గౌడ్, సంఘం డైరెక్టర్లు ఘనగాని నర్సింహులుగౌడ్, మొరిగాడి కాటమయ్యగౌడ్,మొరిగాడి బాలరాజుగౌడ్,మొరిగాడి విద్యాసాగర్‌గౌడ్, సీసా సత్తయ్యగౌడ్, జనగామ మహేష్‌గౌడ్,గణగాని రాముగౌడ్, సీస ప్రవీణ్ గౌడ్ , దూడల యాదగిరిగౌడ్, పుట్టా అంజయ్యగౌడ్ పాల్గొన్నారు.