Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బౌద్ధంలోనే మనుషులందరికి సమానత్వం ఉంది..
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు డా.బెల్లి యాదయ్య
నవతెలంగాణ-రామన్నపేట
బుద్ధుడి బోధనలు, బౌద్ధ సాహిత్యాన్ని విద్యార్థులు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు డా. బెల్లి యాదయ్య సూచించారు.స్థానిక ప్రభుత్వ కళాశాల సామాజిక శాస్త్రాల విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం దమ్మ చక్రపరివర్తన దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బౌద్ధ బోధనలను డా.బీఆర్.అంబేద్కర్ నమ్మినారని, ప్రతిభ, సన్మార్గం, కరుణ అనే త్రిగుణాలు సమాజంలో నెలకొనాలన్న తపనతో అంబేద్కర్ మహాశయుడు బౌద్ధం స్వీకరించారని తెలిపారు. 1956 అక్టోబర్ 14న ఆరు లక్షల మందితో నాగపూర్‌లో అంబేద్కర్ బౌద్ధమతం స్వీకరించడంతో బౌద్ధంలో 'నవీనయానం' ఆరంభమైందన్నారు.సంధానకర్తగా చరిత్రోపన్యాసకులు డాక్టర్ కాంతయ్య వ్యవహరించిన ఈ కార్యక్రమంలో వైస్‌ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఇందిర, కామర్స్ విభాగాధిపతి రామాదేవి, అంబేద్కర్ అధ్యయనకేంద్రం కోఆర్డినేటర్ మక్లా, అధ్యాపకులు సరిత బుద్ధిజం విశేషాలను విద్యార్థులకు వివరించారు.అక్టోబర్ 14 ధమ్మ చక్రదివస్ చారిత్రక నేపథ్యాన్ని డిగ్రీ ద్వితీయ సంవత్సర విద్యార్థి జలంధర్ చదివిన ప్రసంగపత్రం సభను విశేషంగా ఆకట్టుకుంది.అంతకుముందు బుద్ధుడు, అంబేద్కర్ చిత్రపటాలను ప్రధానాచార్యులు పూలమాలతో అలంకరించారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు.