Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరుటౌన్ :ఆలేరు పట్టణంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారింది. అత్యంత ప్రమాదకరంగా తయారై ఉన్న ఓవర్ బ్రిడ్జి పలుమార్లు పట్టణ వాసులు నెత్తినోరు పోయేలా మొత్తుకున్నా అధికారులు , ప్రజాప్రతినిధులు ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది.దీంతో అనేక ప్రమాదాలు జరిగి నిత్యం ఎంతోమంది క్షతగాత్రులుగా, వికలాంగులుగా మారిపోతున్నారు.గురువారం రాత్రి పట్టణంలోని ఓ రైస్‌మిల్లులో పనిచేస్తున్న కార్మికుడు చీకట్లో గుంతలు చూసుకోక ప్రమాదవశాత్తు పడి తలకు, ఇతర చోట్ల బలమైన గాయాల య్యాయి. స్థానికులు ప్రాథమిక చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స నిర్వహించారు.తీవ్రగాయాలు కావడంతో ఆయనకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.ఇకనైనా అసమర్ధ అధికారులకు, ప్రజాప్రతినిధులకు కనువిప్పు కలగాని, ఆలేరు ఫ్లైఓవర్ బ్రిడ్జి పైన ఉన్న గుంతలను పూడ్చి, ప్రమాద సూచికలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని పట్టణానికి చెందిన బందెల సుభాష్ కోరుతున్నారు.