Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం
నవతెలంగాణ-రామన్నపేట
జీవితంలో ఎన్నో అడుగులు ఉంటాయని, ఎన్ని కష్టాలొచ్చినా..నష్టాలొచ్చినా,బాధలు కలిగిన మనోధైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోదని మనోధైర్యానికి మించిన మందు మరొకటి లేదని మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు.శుక్రవారం మండల కేంద్రంలోని యూత్ నాయకులు బుల్లెట్(మండ్ర నరేష్) తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న సమాచారాన్ని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి పరామర్శించి, మనోధైర్యాన్ని కల్పించారు.ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ట్ నాయకులు కైరంకొండ నందకుమార్ తల్లి సుశీల ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లి సుశీల చిత్రపటానికి పూలమాలలేసి కుటుంబసభ్యులను పరామర్శించారు.ఆయన వెంట టీఆర్ఎస్ మాజీ మండలఅధ్యక్షులు గంగుల వెంకట రాజారెడ్డి, మండల నాయకులు గోదాసు పృధ్వీరాజ్, డీసీఎంఎస్ జిల్లా మాజీ డైరెక్టర్ జెల్లా వెంకటేష్, ఎండి అక్రం, గోలుసుల ప్రసాద్, లెంకల ప్రవీణ్, కోట సుధాకర్, మాడురి రామచందర్ రావు, వైద్యం సాయి, అజర్, ఉదయ్, శ్రీకాంత్, వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.