Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-హుజూర్‌నగర్‌రూరల్
తెలంగాణ రాష్ట్రంలో మతోన్మాద విధానాలను అనుసరిస్తున్న బీజేపీ స్థానం లేదని,ఆ పార్టీ తెలంగాణలో అడుగుపెట్టనివ్వమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు.శుక్రవారం మండల పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో నిర్వహించిన పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పార్టీ జెండాదిమ్మెను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని, ఆ ప్రయత్నాలను సీపీఐ(ఎం) తిప్పికొట్టడం ఖాయమన్నారు.రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.రాష్ట్రంలో మత ఘర్షణలకు నిలయంగా మారుతుందని విమర్శించారు.కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఎనిమిదేండ్లవుతున్నా ప్రజలపై అనేక భారాలు వేశారని విమర్శించారు.మునుగోడు ఉపఎన్నికల్లో కమ్యూనిస్టులు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు.పార్టీ మండల కార్యదర్శి పోషణబోయిన హుస్సేన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నగరపు పాండు, పల్లె వెంకటరెడ్డి, శీలం శ్రీను, మండల కమిటీ సభ్యులు తంగేళ్ల వెంకట చంద్ర పిన్నపురెడ్డి వెంకట్‌రెడ్డి, షేక్ ఖాశీం, లక్ష్మీ, నర్సమ్మ, మీగడ రాములు, సీపీఐ(ఎం) గ్రామ కార్యదర్శి నర్సింహాచారి,గ్రామ నాయకులు గోపరాజు నారాయణరెడ్డి, పూర్ణావతి, శ్రీను, శ్రీనివాసరావు, గోపి, శశికళ, రమేష్, చిట్టెమ్మ పాల్గొన్నారు.