Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రాలలో మౌలికవసతులు కల్పించాలి
- అధికారులందరు సమన్వయంతో పనిచేయాలి
- కలెక్టర్ పాటిల్ హేమంతకేశవ్
నవతెలంగాణ సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో వానాకాలం పంట కొనుగోలుకు ఈ నెల 22న ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్హేమంత్ పాటిల్ కేశవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ అదనపు కలెక్టర్ యస్. మోహన్‌రావుతో కలిసి ఖరీఫ్,2022 ధాన్యం కొనుగోలు పై అధికారులు, మిల్లర్లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డీఆర్డీఏ ద్వారా 100, డీసీఓ ద్వారా 85 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున ఏర్పాటు చేసే కేంద్రాలలో అన్ని వసతులు కల్పిస్తూ రైతులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.అవసరమైతే మరి కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. పంట పండించిన రైతులు నేరుగా కొనుగోలుకేంద్రాలకు ధాన్యం తెచ్చే విధంగా అలాగే తేమశాతం 17 శాతం మించకుండా ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహనతో పాటు ప్రభుత్వ మద్దతుధర గ్రేడ్-ఏ రూ.2060, గ్రేడ్ సి కామన్ వెరైటీ రూ.2040 కల్పించాలని సూచించారు.ఏర్పాటు చేసే అన్ని కేంద్రాలలో ధాన్యం శుద్ధి మిషన్లు, తేమశాతం మీటర్లు, ఖంటాలు తప్పక అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్లు రైతులకు పూర్తిగా సహకరించాలని సూచించారు.ఇతర జిల్లాల నుండి ధాన్యం రాకుండా చెక్‌పోస్టుల్లో గట్టినిఘా ఉంచాలని, అలాగే జిల్లాలో వర్షాలు తరుచుగా పడుచున్నందున కొనుగోలు చేసే ధాన్యం తడవకుండా వాటర్ ప్రూఫ్ టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, డీఏఓ రామారావునాయక్, డీఎం రాంపతినాయక్, మార్కెటింగ్ అధికారి సంతోష్, ఆర్టీఓ వెంకట్‌రెడ్డి, ఏఎస్ఓ పుల్లయ్య, జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రవీంద్ర, తాలూకా మిల్లర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.