Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'నవతెలంగాణ' వార్త ఎఫెక్ట్
- పలు షాపులపై అధికారుల దాడులు కేసులు నమోదు
నవతెలంగాణ-సూర్యాపేట
' నవతెలంగాణ'లో వచ్చిన తూకలో చేతి వాటం అనే వార్తపై జిల్లాలో విజిలెన్స్,ఎన్ఫోర్స్మెంట్, తూనికలు కొలతల శాఖల అధికారులు స్పందించారు.ఈ మేరకు పలు దుకాణాలపై అధికారులు తనిఖీలు చేపట్టారు.ఇందులో భాగంగా కోదాడ పట్టణంలో విజిలెన్స్,ఎన్ఫోర్స్మెంట్, తూనికలు కొలతల శాఖల ఆధ్వర్యంలో పలురకాల షాపులపై తనిఖీలు నిర్వహించారు.కాంటాలు సరిగ్గా లేని వాటితో పాటు లైసెన్సులు,సీళ్లు లేని పలు కాంటాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.అదేవిధంగా పట్టణంలో ఎఫ్‌సీఐ గౌడౌన్స్పై దాడులు నిర్వహించారు.పట్టణంలో గల కిరాణం,చికెన్ సెంటర్ లలో చేసిన దాడుల్లో మొత్తం 8 కేసులు నమోదు చేశారు.ఈ సందర్భంగా తూనికలు కొలతలు శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం నవతెలంగాణతో మాట్లాడుతూ జిల్లాలో గల అన్ని షాపులపై విడతల వారిగా దాడులు నిర్వహిస్తామన్నారు.ప్రతి షాపుదారుడు తప్పనిసరిగా లైసెన్సులు పొందాలని పేర్కొన్నారు.బాట్లపై గడువు ముగిసిన తర్వాత ముద్రలు వేయించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో విజిలెన్స్,ఎన్ఫోర్స్మెంట్ సీఐ మహేష్,ఎస్సై గౌస్‌తో పాటు ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు..