Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
మండలంలో విద్యుత్ ఏఈతో పాటు అధికారుల దౌర్జన్యం నిర్లక్ష్యం మూలంగా రెండు రోజులుగా ఒక నిరుపేద కుటుంబం వీధి దీపం కిందనే జీవనం సాగిస్తున్న సంఘటన గురువారం రాత్రి మండలం తొండ గ్రామంలో వెలుగులోకి వచ్చింది.వివరాల్లోళ్తే.. తొండ గ్రామానికి చెందిన నీరటి శోభ నిరుపేద కావడంతో విద్యుత్ అధికారులు దౌర్జన్యంతో ఇంటి విద్యుత్‌ను తొలగించడంతో ఆ ఇంటి యజమాని ఇంట్లోనికి రానివ్వలేదు.దీంతో అదే వీధిలో ఉన్న వీధి దీపం కిందనే వంట చేస్తూ జీవనం సాగిస్తుంది.ఇటీవల దగ్గర బంధువు చనిపోవడంతో శాస్త్రీయంగా ఆ ఇంటిని నెల రోజులుగా విడిచి పెట్టాలని చెప్పడం మూలంగా తాను ఉన్న ఇంటిని ఖాళీ చేసి అదే గ్రామంలోని మరో ఇంట్లో అద్దెకు ఉంటుంది.తిరుమలగిరి విద్యుత్ ఏఈతో పాటు లైన్ఇన్స్పెక్టర్, సిబ్బంది ఎలాంటి సమాచారం లేకుండా ఏకపక్షంగా ఆ సిబ్బందితో శోభ ఇంటికి ఉన్న బిల్లును కట్టలేదని అద్దె ఉన్న ఇంటి సర్వీస్ వైర్ తొలగించడంతో ఆ ఇంటి యజమాని మీ కారణంగానే నా ఇంటిని విద్యుత్ తొలగించారని ఇంటి నుండి గెంటివేశాడు.దీంతో చేసేది ఏమీ లేక బాధితురాలు రెండు రోజుల కింద విద్యుత్ అధికారిని తాను త్వరలోనే బకాయి చెల్లిస్తానని చెప్పినా వినకుండా అద్దెకు ఉన్న ఇంటి సర్వీస్ తొలగించారని ఆరోపించింది.అద్దె ఇంటి యజమాని నీ మూలంగా మా యొక్క ఇంటి సర్వీసులు తొలగించారని వెళ్ళిపోమని బయట గెంటి వేయడంతో చేసేదేమీ లేక రెండు రోజులుగా చీకట్లోనే జీవనం సాగిస్తున్నామని వాపోయింది.అసలే వర్షాకాలం పాములు, ఇతర విషపురుగులు సంచరిస్తుండడంతో తాము తమ పిల్లలతో బిక్కుబిక్కుమంటూ ప్రాణ భయంతో ఉన్నామని తెలిపారు. ఎలాగైనా అధికారులు ప్రజాప్రతినిధులు తమకు న్యాయం చేయాలని కోరారు.