Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది మునుగోడు ముచ్చట..
- అద్దె ఇంటికోసం టీఆర్ఎస్ బీజేపీ బహిరంగవేలం..
- రేకులషెడ్ను రూ.1.10 లక్షలకు దక్కించుకున్న టీఆర్ఎస్..
- బస్తీమే సవాల్ తగ్గేదేలే అంటున్న పార్టీలు
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
మునుగోడు ఉప ఎన్నికలో ప్రతి అంశంలో బీజేపీ, టీఆర్ఎస్లు తగ్గేదేలే అన్నట్లుగా తలపడుతున్నాయి. ఈ పోటీ ఓ రేకులషెడ్ ఇంటికి పదిహేను రోజులకు అక్షరాల లక్షాపదివేల రూపాయల కిరాయి వచ్చేలా చేసింది. అది కూడా ఆషామాషీగా కాదు. బహిరంగ వేలంపాటలో బాహాబాహీ తలపడి మరీ టీఆర్ఎస్ దక్కించుకుంది. మునుగోడు నియోజకవర్గంలోని ఓ గ్రామంలో ఆదివారం ఓ ఇంటికి అర్రాస్ పాట జరిగింది. ఉప ఎన్నికల కోసం గ్రామంలో ప్రచారానికి బయటనుండి వచ్చిన వారికోసం టీఆర్ఎస్ నాయకులు ఓ రేకులతో నిర్మించిన ఇంటిని గ్రామంలో రూ.25 వేలు అద్దెకు మాట్లాడుకొని రూ.5 వేలు అడ్వాన్స్ చెల్లించారు. కానీ,ఉదయాన్నే వచ్చిచూసేసరికి ఆ ఇంటికి బీజేపీ జెండా కట్టి ఉండడంతో టీఆర్ఎస్ నాయకులు ఇదేంటని ప్రశ్నించారు. అన్నదమ్ములు ఇద్దరు చెరో పార్టీకి మాట ఇచ్చారని తేలడం, అప్పటికే గ్రామస్తులు గుంపులుగా చేరడం జరిగింది. ఇల్లు మాకంటే మాకని బీజేపీ టిఆర్ఎస్ నాయకులు వాదనకు దిగడంతో, పెద్దలు జోక్యం చేసుకుని వేలంపాట పెట్టుకోండి ఇంటియజమానికైనా లాభమవుతుందని సూచించారు. లక్షరూపాయలు బిజేపి వాళ్లు పాడగా లక్షపదివేల రూపాయలకు పాడి టిఆర్ఎస్ వాళ్లు దక్కించుకున్నారు. మునుగోడా..మజాకా!! ఇంకా ఎన్ని విచిత్రాలు చూడాలో మరి...!