Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ప్రత్యేక జిల్లా ఏర్పాటు ఉద్యమంలో భాగంగా 100 రోజులు పూర్తి అయినా సందర్బంగా సోమవారం పట్టణంలో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. అన్ని అర్హతలున్న మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించకపోవడం. రాజకీయ కుట్రలో భాగమేనన్నారు. ఏలాంటి అర్హతలు లేని ఒక్క నియోజకవర్గం ఉన్న వాటిని జిల్లాగా ప్రకటించి, మిర్యాలగూడ ను జిల్లా గా ప్రకటించకపోవడం బాధాకరం అన్నారు. మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు అయితే ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్, ఏఐఎంఐఎం జిల్లా సహాయ కార్యదర్శి సయ్యద్ ఫరూక్, బీసీ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి బంటు కవిత, బెజ్జం జానయ్య, సతీష్, ప్రవీణ్, సమీర్, సాయి ప్రణయ్, అరుణ్‌కుమార్, నాగరాజు, నరేష్, నందు, తదితరులు పాల్గొన్నారు.