Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాంపల్లి
మండలంలోని పసునూర్ గ్రామానికి చెందిన 15 గిరిజన కుటుంబాలకు సంబంధించిన 40 మంది సోమవారం నాంపల్లి జెడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్, గిరిజన బంధు లాంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తామంతా పార్టీలో చేరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల్ కో ఆప్షన్ సభ్యులు అబ్బాస్, వెంకట్ రెడ్డి, గ్రామశాఖ నరేష్, మండల్ మైనార్టీ జానీ, పార్టీ ముఖ్య కార్యకర్తలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.