Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చండూరు
టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు అన్నారు. గట్టుప్పల మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టులకు అమ్ముడు పోయి తెచ్చిన ఎన్నికలని, బీజేపీతో అభివృద్ధి ఎట్లా సాధ్యమన్నారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కేవలం టీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. కార్యాలయం ప్రారంభం అనంతరం గట్టుప్పల మండల కేంద్రములో భారీర్యాలీ నిర్వహించి ప్రచారం చేశారు. సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలతో మమేకమై, మహిళలకు బొట్టు పెట్టి, నవంబర్ 3న జరిగే ఉప ఎన్నికల్లో కారు గుర్తు కే ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జెడ్పీటీస వెంకటేశం, సర్పంచ్ ఇడం రోజా, ఎంపిటీసిలు గీత శ్రీనివాస్, చెరుపల్లి భాస్కర్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇడం కైలాసం, భీమగాని మహేష్‌గౌడ్, మంగ వెంకటేష్, బండారు చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.