Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
మండలంలోని తుక్కాపూర్ శివారులో నూతనంగా నిర్మిస్తున్న సిద్ధం రిసోర్స్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ అనుమతులను రద్దు చేయాలని కోరుతూ ఆ గ్రామ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ సిద్ధం రిసోర్స్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ అనుమతులు రద్దు చేయాలని, రిలే నిరాహార దీక్షలు చేపట్టి జిల్లా కలెక్టర్ వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు. పై అధికారులకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ వారు అవేమీ పట్టించుకోకుండా కంపెనీలో పనులు అక్రమంగా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. వెంటనే కంపెనీ అనుమతులను రద్దు చేయాలని , తుక్కాపురం, గౌస్ నగర్, ఎర్రంబెల్లితో పాటు పలు గ్రామాల ప్రజలు కాలుష్యం బారిన పడకుండా చూడాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు నల్లమాస సత్యనారయణ గౌడ్, జక్కుల ఉప్పలయ్య యాదవ్, రత్నపురం శ్రీనివాస్, రాసాల వెటంకటేష్, కంఠం యాదేష్ , రత్నపురం శీకాంత్, ఏడుమేకల మహేష్ ,కొసన వినరు, రాసాల మల్లేష్ పాల్గొన్నారు.