Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గత ప్రభుత్వాల పాలనే మునుగోడుకు శాపం
- కొన్ని సంవత్సరాల ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టిన కేసీఆర్
- ప్రభుత్వం నిధులు ఇచ్చిన ఉపయోగించుకొని పాలకుల తీరు
- కారు వెంటే నడుస్తామంటున్న లెంకలపల్లి వాసులు
నవతెలంగాణ-మర్రిగూడ
గత ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరితోనే మునుగోడు వెనుకబడిందని, కొన్ని సంవత్సరాల నుండి అనుభవిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను తరిమికొట్టింది కేసీఆర్ అని ప్రజలు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం నిధులు ఇస్తున్న వాటిని గత పాలకులు కాలయాపన చేసి దుర్వినియోగం చేసి లెంకలపల్లిలో సమస్యల వలయాన్ని సృష్టించారని గ్రామవాసులు పేర్కొంటున్నారు. కారు వెంటనే లెంకలపల్లి ప్రజానీకం ఉంటుందని ముక్తకంఠంతో చెపుతున్నారు.
లెంకలపల్లి..
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని ఒక మారుమూల గ్రామం లెంకలపల్లి. ఇప్పుడు కేసీఆర్ ఇన్చార్జిగా ప్రపంచానికి పరిచయమవుతున్న గ్రామం. లెంకలపల్లిలో మొత్తం 3వేల జనాభా.ఉన్నారు. 2,150 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 470 యాదవులు, 400 గౌడ్స్, 360 ఎస్సీ, 170 రజక, 100 ఉప్పరి, 68 వడ్డెర, 70 రెడ్డి,32 మంగలి, 50 మైనారిటీ,30 వడ్రంగి, 400 ఇతరులు ఉన్నారు. రెక్కాడితే డొక్కాడని గ్రామం లెంకలపల్లి.. అక్కడి ప్రజల ప్రధాన ఆధారం వ్యవసాయం. కోడికూతతో మొదలైతుంది వారి జీవన శైలి. భూగర్భ జలాలు లేక ఎంతో మంది రైతులు బోర్లు వేసి ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక పత్తి లేబర్స్‌గా, షాపుల్లో వర్కర్లుగా, పట్టణాలలో ప్రయివేట్ ఉద్యోగస్తులుగా జీవనం కొనసాగిస్తున్నారు. సరైన విద్య అవకాశాలు లేక కొన్ని కిలోమీటర్ల మేర వెళ్లి విద్యార్థులు చదువుకుంటున్నారు. వైద్య అవకాశాలు లేక ఎంతో మంది ప్రజలు అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. నిత్యవసరాల కోసం ప్రజలు ఎటు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న చండూర్కుగాని మర్రిగూడకు పోవాల్సిన పరిస్థితి.
కేసీఆర్ ఇన్చార్జితో...
కేసీఆర్ ఇన్చార్జి తీసుకున్నందుకు ఆ గ్రామంలోని ప్రజల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. తమ ఊరు అన్ని విధాలుగా అభివద్ధి చెందుతుందని ప్రజలంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్ కేసీఆర్ ఇన్చార్జి బృందం ఇప్పటికే గత రెండు వారాల నుండి లంకలపల్లిలో మఖాం వేసింది. ఎలాగైనా లెంకలపల్లిలో టీిఆర్‌ఎస్ వైపు ఏకపక్షంగా ఓటింగ్ వచ్చే విధంగా టీఆర్ఎస్ శ్రేణులు మంతనాలు చేస్తున్నారు. లెంకలపల్లి ప్రజలు కూడా ఏకపక్షంగా టీఆర్ఎస్ని గెలిపించాలనే ఉద్ధేశ్యంతో ఉన్నారు. టీఆర్ఎస్ గెలిస్తే అన్ని విధాల ఆ ప్రాంతం అభివృద్ది చెందుతుందని భావిస్తున్నారు.
దత్తత తీసుకోవడం మా అదృష్టం..
పాక నగేష్‌యాదవ్ (లెంకలపల్లి సర్పంచ్)
కెేసీఆర్ ఇన్చార్జిగా, లెంకలపల్లిని దత్తత తీసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మా లెంకలపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని అందుకు లంకలపల్లి ప్రజలమైన మేమంతా ఏకపక్షంగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినీ గెలిపించుకుంటాం.
మేమంతా టీఆర్ఎస్ వైపే..
-అయితగోని వెంకటయ్య (లెంకలపల్లి మాజీ ఎంపీటీసీ)
లెంకలపల్లి ప్రజలంతా ఏకపక్షంగా టీఆర్ఎస్ వైపు ఉన్నారు. కేసీఆర్ దత్తత తీసుకున్నందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఈ రోజు లెంకలపల్లి అనేది ప్రపంచానికి తెలిసేటట్టు చేసిన కేసీఆర్‌కి ధన్యవాదాలు. మా గ్రామంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించి మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నార.