Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాంపల్లి
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుతోనే మునుగోడు అభివృద్ధి సాధ్యమవుతుందని మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. సోమవారం నాంపల్లి మండలంలోని ఫకిర్పురం గ్రామంలో స్థానిక టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఓటరును కలిసి తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి వారు ఇప్పటివరకు ప్రభుత్వం నుండి పొందిన లబ్ధిని గురించి తెలుసుకున్నారు. మునుగోడు నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలంటే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్‌కుమార్, గ్రామసర్పంచ్ అందుగుల కవిత యాదయ్య, ఉపసర్పంచ్ శ్రీను, గ్రామశాఖ అధ్యక్షుడు యాదయ్య, గణేష్, వినోద్, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.