Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనరల్ ఖరారు
- చైర్మెన్ గిరి కోసం ఆశావహులు పోటీ
- మంత్రి జగదీశ్‌రెడ్డి మదిలో ఎవరో...?
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్రం లో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌గా పేరుగాంచిన సూర్యాపేట మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవి కాలం ఈనెల 19 తో ముగియనున్నది.సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు రెండేండ్ల కిందే కమిటీని నియమించిన విషయం తెలిసిందే.మార్కెట్ కమిటీ చైర్మెన్‌గా ఉప్పల లలిత ఆనంద్, వైస్‌చైర్మెన్‌గా పలువురు డైరెక్టర్లుగా నియమితులైన విషయం తెలిసిందే.జనరల్ మహిళా రిజర్వేషన్‌గా మారడంతో రెండేండ్ల కింద ఉప్పల ఆనంద్ భార్య ఉప్పల లలిత మార్కెట్ చైర్మెన్ పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈ రకంగా ప్రభుత్వం ప్రతిపాదించిన ఏడాదికాలంతో పాటు పొడిగింపుతో కలుపుకొని రెండేండ్లపాటు పాలకవర్గం కొనసాగింది.కాగా పాలకవర్గం పనితీరు బాగుందనే దష్ట్యా మరో ఏడాది పొడిగించారు.కాగా ఈనెల 19తో పాలకవర్గం గడువు ముగిస్తుంది.లాటరీ విధానంతో రొటేషన్ పద్ధతిలో మార్కెట్ చైర్మెన్ పదవి జనరల్ మారింది.జనరల్ కావడంతో ఇప్పటివరకు ఈ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆశావహులు పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించనున్నారు.ఇదిలావుండగా గతంలోనే వ్యవసాయ మార్కెట్ పాలకవర్గాల నియామకానికి లాటరీ పద్ధతిలో ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది.ప్రస్తుత రిజర్వేషన్లు కాకుండా కొత్తగా రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లను ఖరారు చేశారు.ఈ మేరకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఆయా మార్కెట్లకు ప్రభుత్వం ఉత్తర్వులను పంపింది.ప్రధానంగా తెలంగాణలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌గా పేరుగాంచిన సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మెన్ పదవిపై టీఆర్ఎస్లో అనేకమంది ఆశలు పెట్టుకున్నారు.రోటేషన్ పద్ధతిలో జనరల్ కావడంతో ఆశావహులు పదవి కోసం రంగంలోకి దిగే అవకాశం ఉన్నది.కాగా విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మదిలో ఎవరున్నారో మరి కొద్దిరోజుల్లో తేలే అవకాశం ఉంది.