Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పాటిల్ హేమంత్కేశవ్
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ప్రజావాణి దరఖాస్తులపై అధికారులు సత్వరమే స్పందించాలని కలెక్టర్ పాటిల్హేమంత్ కేశవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి తమ సమస్యలపై ప్రజా వాణి కార్యక్రమానికి ప్రజలు వస్తున్నారని, వారి సమస్యలను గుర్తించి పరిష్కరిం చడానికి చర్యలు తీసుకోవా లన్నారు.ప్రతి అధికారి ఫిర్యాదుదారులకు రశీదు ఇవ్వాలన్నారు.ఇందులో భాగంగా చివ్వెంల మండల తుంజారావుపేటకు చెందిన వికలాంగుడు గుగులోతు కృష్ణ చేతికర్రలకోసం దరఖాస్తు చేసుకోగా వెంటనే స్పందించిన కలెక్టర్ చేతికర్రలను డీడబ్య్లూఓ అధికారిణి జ్యోతిపద్మ ద్వారా తెప్పించి అతనికి అందజేశారుప్రజావాణిలో రెవెన్యూ శాఖకు 46 దరఖాస్తులు, డీఎస్పీ సూర్యాపేట వారికి ఒక దరఖాస్తు, పెన్షన్ల కోసం 30 దరఖాస్తులు వచ్చాయన్నారు.మొత్తం 77 దరఖాస్తులు ప్రజల నుండి వచ్చాయని, ఆ దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎస్.మోహన్రావు, ఆర్డీఓ రాజేంద్రకుమార్,సిబ్బంది, అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.