Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ
నవతెలంగాణ-చౌటుప్పల్
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని హైద్రాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ ధీమా వ్యక్తంచేశారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని 16,17,18 వార్డుల్లో సీపీఐ(ఎం), సీపీఐ బలపర్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలిపారు. రైతుబంధు, దళితబంధు, కల్యాణలక్ష్మీ, ఆసరా పింఛన్లను ప్రజలకు వివరించి ఓట్లు అడిగారు. టీఆర్ఎస్తోనే మునుగోడు అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మున్సిపల్, సింగిల్‌విండో ఛైర్మన్లు వెన్‌రెడ్డి రాజు, చింతల దామోదర్‌రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, నాయకులు భీమిడి రాంరెడ్డి, తడక అమర్, చింతల మహిపాల్‌రెడ్డి, కానుగుల వెంకటయ్య, కౌన్సిలర్ ఎమ్‌డి.బాబాషరీఫ్ పాల్గొన్నారు.