Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చండూరు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్, కస్టర్ ఇన్‌చార్జ్జి సుభాష్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపుకోసం మంగళవారం గట్టుప్పల్, వెల్మకన్నె, ధర్మతాండ గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు మునుగోడు ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు, రోడ్లు, రుణమాఫీ, పావలా వడ్డీ, ఆరోగ్యశ్రీ, వంటి పథకాలతో పాటు, బిడ్డలకు ఉద్యోగాలు, దళితులకు భూములు ఇవ్వడం జరిగిందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచి మూడేండ్ల కాలంలో ఏ అభివృద్ధి చేయలేదన్నారు. కాంగ్రెస్ రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లడం, మళ్లీ పోటీ చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి హస్తం గుర్తుకు మీ ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించండి అని ఆది శ్రీనివాస్ ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు యాదగిరి రెడ్డి, బుచ్చయ్య, సత్యనారాయణ, యాదయ్య, నరేందర్ ,ఆది, మల్లేశం, హనుమంతు, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.